ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ చురుకుగా ఉంటున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో చాలారోజుల పాటు ఇంటికే పరిమితమైన లోకేష్...ఇటీవల వరదల వల్ల దెబ్బ తిన్న పంటలని పరిశీలించారు. అలాగే రైతులని ఓదారుస్తూ, జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక యాత్ర అయ్యాక ఓ మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.