వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు...అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. చాలారోజుల నుంచి ఈయన ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఎప్పటిలాగానే రాజుగారు తాజాగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే విజయనగరం జిల్లాలో కీలకంగా ఉన్నా మాన్సస్ ట్రస్ట్, సింహాచల గుడి ఛైర్మన్ పదవిలో సంచయితని కూర్చోపెట్టడంపై ఎప్పటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పోరాటం చేస్తూనే ఉన్నారు.