ఏపీలో స్థానికసంస్థల ఎన్నికలని నిర్వహించడానికి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించేసారు కూడా. ప్రభుత్వoతో చర్చించి త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధంగా లేము అని తేల్చేసింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.