ఇసుక...ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండేది. గత ప్రభుత్వాల్లో ఇసుక గురించి పెద్ద చర్చ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి ఇసుక అంశం తెరపైకి వచ్చింది. ఇసుకలో టీడీపీ నేతలు కోట్లు కోట్లు తినేశారనే ఆరోపణలు ఎక్కువగానే వచ్చాయి. కాకపోతే ఇసుక అందుబాటులో ఉండేది. ధరలు కూడా తక్కువే ఉండేవి. అయితే అప్పుడే టీడీపీ ప్రభుత్వం ఇసుకలో అక్రమాలకు పాల్పడుతుందనే విమర్శలు వచ్చాయి.