జగన్ తీసుకున్న ఒక నిర్ణయంతో అమరావతి రైతుల భవిష్యత్‌పై ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి, అక్కడ భూములు తీసుకుని, కొన్ని భవనాలు కట్టి అధికారానికి దూరమయ్యారు. ఇక అధికారంలోకి వచ్చాక జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఉన్న అమరావతిని శాసన రాజధానిగా చేసి, విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు.