క్రియాశీలక సభ్యులతో సమావేశాలు పెడుతున్న జనసేనాని పవన్ కల్యాణ్.. జనసైనికులకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో అంతర్గత కలహాలపై మాట్లాడిన ఆయన.. పార్టీ నాయకులు నచ్చకపోతే అధినాయకత్వానికి తెలియజేయాలని అంతేకాని.. సోషల్ మీడియాలో గొడవ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వందమంది వెళ్లిపోతే వెయ్యిమందిని తయారు చేస్తానని అన్న పవన్.. నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోతే బలహీన పడే వ్యక్తిని తాను కాదని చెప్పారు.