విద్యాకానుక పేరుతో పిల్లలకు ఇచ్చిన కిట్ లలో లోపాలుంటే వెంటనే వాటిని సవరించాలని చెప్పారు ఏపీ సీఎం జగన్. జగనన్న విద్యాకానుక కిట్ ల నాణ్యతపై దృష్టిపెట్టాలని కలెక్టర్ల సమీక్షలో చెప్పారు. పిల్లలెవరికైనా షూ సైజ్ సరిపోకపోయినా, లేక పెద్దవిగా అయినా అడిగి తెలుసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఆ మేరకు ప్రతి స్కూల్లో నోటీసులు పెట్టి, పూర్తి వివరాలు సేకరించాలన్నారు.