విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలకు ఏపీ పచ్చ జెండా ఊపింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని చేపట్టింది. అటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి ససేమిరా అంది. రైతుల పక్షాన కేంద్రంతో పోరాటానికి దిగుతానంటోంది. ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల మధ్య వచ్చిన విభేదాలు మొత్తంగానే రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపిస్తున్నాయి. గతంలో భాయీ భాయీ అంటూ కలసి తిరిగిన జగన్, కేసీఆర్ మధ్య ఒకరకంగా ప్రధాని మోదీ కారణంగా చిచ్చు రగిలింది.