కొడాలి నాని....ఏపీ మంత్రి. అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళ్ళే నేత. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని...ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే మంత్రివర్గంలో నాని హైలైట్ అయిన విధంగా మరో మంత్రి అవ్వరు. ఎందుకంటే నాని ముక్కుసూటి మనిషి. ఏ విషయాన్నైనా కుండబద్దలుగొట్టినట్లు చెప్పేస్తారు.