ఏపీలో కులాల ఆధారంగానే రాజకీయాలు నడుస్తాయనే సంగతి తెలిసిందే. ప్రధానంగా కమ్మ పార్టీగా టీడీపీకి ముద్ర ఉంది. అలాగే వైసీపీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఉందనే విమర్శలు ఉన్నాయి. అయితే టీడీపీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అలాగే వైసీపీలో కమ్మ నాయకులు ఉన్నారు. ఇక 2019 ఎన్నికల్లో అధికార వైసీపీలో పలువురు కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధానంగా కొడాలి నాని మంత్రిగా ఉన్నారు.