ప్రతిపక్ష టీడీపీ ఓ వ్యూహం ప్రకారం వైసీపీ నేతలనీ టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్కో సమయంలో ఒక్కో నాయకుడుని టార్గెట్ చేస్తూ, వారిని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కొందరు మంత్రుల లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతున్నట్లే తెలుస్తోంది. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ధర్మాన ప్రసాదరావు, సుచరిత, నారాయణ స్వామి, గుమ్మనూరు జయరాం, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారిని పలు సందర్భాల్లో ఏదొక అంశం మీద విమర్శలు చేస్తూనే వచ్చారు. పలు రకాల ఆరోపణలు కూడా గుప్పించారు.