ఎక్కడ ఉన్నా.. బుద్ధిపోనిచ్చుకోలేదన్నది సామెత! ఇప్పుడు ఇది అచ్చుగుద్దినట్టు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వర్తిస్తుందని అంటున్నారు పరిశీలకులు. అంతర్గత ప్రజాస్వామ్యం అత్యంత ఎక్కువగా ఉన్న కాంగ్రెస్లో వివాదాలు.. విభేదాలు కొత్తకాదు. స్వపక్షంలోనే విపక్షం అనేలా వ్యవహరించే నాయకులకు కూడా కొదవలేదు. అయితే.. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా నాయకులు మారకపోవడం.. ఎప్పుడూ ఒకే పంథాను అనుసరించడం.. కలివిడి లేక పోవడం.. ఎవరికి వారు ఆధిపత్య ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేయడం వంటవి కాంగ్రెస్కు శరాఘాతంగా పరిణమించాయి. ఇప్పుడు ఇవే పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్లో పెచ్చురిల్లాయి.