గతంలో ఎవరైనా నాయకుడు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం, మిగతా పార్టీలు పోటీనుంచి తప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం మాత్రం సందేహంగా కనిపిస్తోంది. దుర్గా ప్రసాద్ కొడుక్కి టికెట్ ఇచ్చే విషయంపై ఎక్కడా ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. తాజాగా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు పెట్టుకున్న మీటింగ్ లో కూడా ఎలాంటి నిర్ణయం తేలలేదు.