నితీశ్ కుమార్ను ఇప్పటికే బీజేపీ నామినేటెడ్ సీఎంగా ట్రోల్ చేసిన రాష్ట్రీయ జనతా దళ్ తాజాగా మరో అంశానికి తెరపైకి తీసుకొచ్చింది. నితీశ్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌధరీకి విద్యా శాఖ బాధ్యతలు అప్పగించడంపై సెటైర్లు పేలుస్తున్నారు..కనీసం జాతీయ గీతం కూడా పాడటం రాని మేవాలాల్కు విద్యాశాఖ కేటాయించడం ఏంటని ఆర్జేడీ ప్రశ్నించింది. గతంలో జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా మేవాలాల్ ‘జనగణమన..’ పాడటంలో ఇబ్బంది పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.