ఏపీలో ఇక పశువులకూ ఆరోగ్య కార్డులు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్బీకేల పరిధిలో పశువుల వివరాలు నమోదు చేసి ప్రతి నెలా పశువుల ఆరోగ్యాన్ని వైద్యులు పరిశీలిస్తారు. పాడి పశువులకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తారు. పాల దిగుబడి వివరాలు కూడా ఇందులో పొందుపరుస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.