కరోనా వ్యాక్సిన్ భారత్ లో అందరికీ అందుబాటులోకి రావడానికి మరింత ఆలస్యం అవుతుందన్న వార్తల నేపథ్యంలో అసలు వ్యాక్సిన్ తయారీపై ఆశాజనకమైన ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో మూడు నాలుగు నెలల్లో కచ్చితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. 135 కోట్ల మంది భారతీయులకు ప్రాధాన్యతను బట్టి వ్యాక్సిన్ అందిస్తామని అన్నారాయన.