గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీల వాగ్దానాలు కోటలు దాటుతున్నాయి. మేయర్ పీఠం బీజేపీకి దక్కితే వారికి చేసే ఉపకారాల గురించి తాజాగా ఆ పార్టీ ఏకరువు పెట్టింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించి మేయర్ పీఠాన్ని కట్టబెడితే నగరంలో వరద బాధితులకు ఇంటికి రూ.25 వేల సహాయం అందిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. వరదల్లో బైక్ పోతే బైక్, కారు కొట్టుకుపోయి ఉంటే కారు, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ ఇప్పించే బాధ్యత బీజేపీది అని భరోసా ఇచ్చారు బండి సంజయ్.