బీజేపీకి అంత దమ్ముందా.. ఖబడ్దార్..అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇన్నెళ్ళల్లో తెరాస సాధించిన విజయాలకు సంబంధించిన ప్రగతి నివేదికను విడుదల చేశారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ అభ్యర్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నివేదికను విడుదల చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో తాము చేసిన అభివృద్ధికి సంబంధించి ప్రతి విషయం ఆ నివేదికలో ఉందని కేటీఆర్ అన్నారు..