గంజాయి కి బానిసైన ఆ యువకుడు మత్తులో పడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని సైతం కోల్పోయాడు..... చివరికి ఉపాధికోసం డెలివరీ బాయ్ గా మారాడు. కానీ అదే మత్తు మళ్ళీ అతన్ని సమస్యల వలయంలో చిక్కుకొనేలా చేసింది. అతడి వ్యసనం చివరికి జైలుపాలు చేసింది. ఉపాధి కోసం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో చేరిన బాలాజీ సింగ్ ఓవైపు డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే..... అతనికి ఉన్న వ్యసనం కారణంగా దూల్‌పేటలోని గంజాయి విక్రేతలతో పరిచయాలు పెంచుకున్నాడు.