ఆంధ్రాలో స్వైవిహారం చేస్తున్న గంజాయి..విజయవాడలో అతి చిన్న వయసులోనే పిల్లలు గంజాయికి అలవాటు పడుతున్నారు. టెన్త్, ఇంటర్, బీటెక్ చదివే విద్యార్థులు ఎక్కువగా ఈ గంజాయి మహమ్మారికి బానిసలవుతున్నారు. దీనిపై పక్కా సమాచారం రావడంతో వెంటనే టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.. కేవలం రెండు రోజుల్లో 55 మందికి పైగా గంజాయి తీసుకుంటున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు..12 మంది బీటెక్, 20 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులు, కొందరు టెన్త్ విద్యార్థులు ఉన్నారు. వీరు విజయవాడలోని ప్రముఖ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.