ఈ మధ్యే లక్ష్మీ విలాస్ బ్యాంకు తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. దీంతో డిపాజిటర్లకు డబ్బు విత్ డ్రాపై ఆర్బీఐ పరిమితులు విధించింది. గరిష్టంగా రూ.25000 వరకు మాత్రమే తీసుకోవచ్చని సూచించడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ ఏదైనా బ్యాంకు నష్టానికి గురైతే ఆ బ్యాంకు నుండి ఒక ఖాతాదారుడు రూ.5 లక్షలకు మించి డ్రా చేయడానికి లేదు.