రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టబోతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోగా.. ఈ స్థాయిలో భారీగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా వైసీపీ సర్కారు అరుదైన ఘనత సాధించిందని అంటున్నారు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పాలనలో పారదర్శకత వచ్చిందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను భ్రష్టు పట్టించిందని, ఆరోగ్యశ్రీని మూలన పడేసిందని విమర్శించారాయన.