టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి క్షేమమే మొదటి లక్ష్యంగా ముందుకు వెళుతుందని తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరిగిందని.... ముఖ్యంగా కనీస వసతులు అందించడంలో విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. మంచినీళ్లు, కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని గతంలో కరెంట్ ఉంటే వార్త, నేడు అది పోతే వార్త అయిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.