ఆర్మీ ఆఫీసర్ నంటూ మహిళలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనియల్ సైట్లో ఆర్మీ ఆఫీసర్గా రిజిస్టరై పెళ్లి పేరుతో యువతులను ట్రాప్ చేసేవాడు. ఖరీదైర కార్లలో తిరుగుతూ వారిని నమ్మించి భారీగా డబ్బులు కాజేశాడు..చాలా మంది అతని మోజులో పడి డబ్బులను సమర్పించుకున్నారు. చివరికి మోసపోయామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన భాగ్యనగరం హైదరాబాద్ లో చోటు చేసుకుంది.17 మంది మహిళలను ట్రాప్ చేసి వారి దగ్గర నుంచి దాదాపు 7 కోట్ల వరకు డబ్బులను గుంజాడని సమాచారం.