పరిపాలన సౌలభ్యం కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే జగన్, తన పాదయాత్ర సమయంలోనే ఒక్కో పార్లమెంట్‌ని ఒక్కో జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఆ దిశగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం మొత్తం 25 జిల్లాలుగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.