ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే తెలంగాణ దుబ్బాక ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్పై విజయం సాధించారో..అప్పటినుంచి బీజేపీ దూకుడు మీద ఉంది. ఆ విజయంతో తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుంది. అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ని దెబ్బకొడతామని చెబుతున్నారు. అయితే తెలంగాణ బీజేపీ దూకుడుగా ఉండటంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ అక్కడ విజయం చూసుకుని బీజేపీ ఏపీలో హడావిడి చేస్తుంది.