జగన్ కొట్టిన దెబ్బకు విశాఖపట్నంలో టీడీపీ అసలు కోలుకోలేకపోతుందనే చెప్పొచ్చు. జగన్ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ టీడీపీ మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని ఉద్యమాలు కూడా చేస్తుంది. దీంతో విశాఖలో తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. అటు అమరావతికి మద్ధతు తెలపలేరు. ఇటు విశాఖని స్వాగతించలేరు.