హైదరాబాద్ బీజేపి ఆఫీస్ లో రచ్చ రచ్చే.. కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ, తోపులాట జరిగింది. కొంత మంది ఒకర్నొకరు తన్నుకున్నారు.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..గన్‌ఫౌండ్రికి చెందిన శైలేందర్, ఓంప్రకాష్ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ నెలకొంది. బీ ఫామ్ తీసుకునేందుకు వచ్చిన ఓం ప్రకాష్‌పై.. శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు.. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది..కాసేపు ఆఫీసు లో మాత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది..