సాధారణంగా అధికార పార్టీలో ఆధిపత్య పోరు కాస్త ఎక్కువగానే ఉంటుంది. నేతల మధ్య సరైన సయోధ్య లేక పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు బాగా ఉంటుంది. అయితే ఈ పోరు వల్ల అధికార పార్టీకి డ్యామేజ్ జరిగి ప్రతిపక్షానికి కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలో ఆధిపత్య పోరు గట్టిగా ఉండేది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో పాటు, సొంత పార్టీలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరిగా పడలేదు. దీని వల్ల ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.