కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ (84) సోమవారం మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇక ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన గొగొయ్ సోమవారం సాయంత్రం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు కన్ను మూశారు.