ఏపీలోని గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇకపై అదే గ్రామ పరిధిలో నివాసం ఉండాలి. వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇకపై అదే మున్సిపాల్టీ లేదా కార్పొరేషన్ పరిధిలోనే నివశించాలి. అలా చేయగలిగితేనే ప్రజల సమస్యలు నూటికి నూరుపాళ్లు, అనుకున్న సమయానికి పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉద్యోగులంతా పనిచేసే ప్రాంతాల్లోనే నివాసం ఉండాలనే నిబంధన విధించింది.