దుబ్బాక విజయంతో తిరుపతి లోక్ సభ స్థానాన్ని కూడా కైవసం చేసుకోడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అటు వైసీపీ దివంగత నేత బల్లి దుర్గా ప్రసాద్ తనయుడికి టికెట్ ఇవ్వదని తేలడంతో.. ఈ ఎన్నికల్లో సింపతీ ఓటింగ్ జరగదని అర్థమవుతోంది. అలాంటప్పుడు బలమైన నేతను నిలబెడితే, చెమటోడ్చి ప్రచారం చేస్తే, మరింత పగడ్బందీగా ఎన్నికల వ్యూహాలు రచిస్తే గెలుపు కష్టమేమీ కాదనేది బీజేపీ ఆలోచన. అందుకే ఆ పార్టీ జనసేనానిని ఢిల్లీకి పిలిపించి మరీ వ్యూహాలు రచిస్తోంది. తిరుపతి బై పోల్ అంశంపై పవన్ కల్యాణ్ తో బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతారని తెలుస్తోంది.