గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ సర్వీసుల్ని పెంచుతూ టీఆర్ఎస్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జంటనగరాల మధ్యతరగతి, పేద ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. లాక్ డౌన్ తర్వాత ఇన్నాళ్లూ ఆటోలతో పాట్లు పడిన ప్రజలకు ఇకపై ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు రోడెక్కాయి.