అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందారు, అధికార మార్పిడి కూడా జరుగుతోంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్ కి వంతపాడుతున్నారు. జో బైడెన్ గెలుపును తాము గుర్తించడం లేదని స్పష్టం చేశారు పుతిన్.