ఏపీలోని స్కూళ్లలో తరగతుల ప్రారంభంపై ఇంతకు ముందు ఇచ్చిన జీవోకు స్వల్ప సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 229 విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం డిసెంబర్ 14వ తేదీ నుంచి అన్ని స్కూళ్లలో 6, 7 తరగతులను మాత్రమే ప్రారంభిస్తారు. సంక్రాంతి సెలవల అనంతరం పరిస్థితులను బట్టి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. సూళ్లను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.