రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమికంగా ఆహార ఉత్పత్తుల శుద్ధి, రెండో దశ ప్రాసెసింగ్ తదితర అవసరాల కోసం దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు జగన్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతున్నందున ఆయా యూనిట్లన్నీ అత్యంత నైపుణ్యంతో, పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ విధానంలో పనిచేస్తూ రైతులకు అండగా నిలిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని చెప్పారు.