రెడ్ మీ ఫోన్ల పేరుతో ఘరానా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి..నకిలీ ఫోన్ల తో పాటుగా పవర్ బ్యాంకులు, రెడ్ మి కు సంబంధించిన అన్ని రకాల వస్తువులను నకీలి పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పటికే చాలా మంది కొనుగోలు చేసి మోసపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..తాజాగా బెంగళూరు, చెన్నైలో రూ .33.3 లక్షల విలువైన నకిలీ షియోమి ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'నకిలీ' షియోమి ఉత్పత్తులను అమ్మినందుకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ ఉత్పత్తులు చెన్నైలోని నలుగురు సరఫరాదారులు మరియు బెంగళూరులో ముగ్గురు సరఫరాదారుల నుండి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మొబైల్ బ్యాక్ కేసులు, హెడ్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు మరియు ఇయర్ ఫోన్లతో కూడిన 3000కి పైగా ఎంఐ ఉత్పత్తులు ఈ రైడ్ లో దొరికినట్లు పోలీసులు తెలిపారు. అన్నీ చెక్ చేసి కొనాలని హెచ్చరించారు..