తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉనికి కోసం పోరాడుతుంది. ఉమ్మడి విడిపోయాక తెలంగాణలో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో, తెలంగాణలో నాయకత్వ లోపం ఏర్పడింది. 2014 ఎన్నికల్లో కొంతమేర సత్తా చాటిన కూడా నెక్స్ట్ కేసీఆర్ దెబ్బకు టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. టీడీపీలోనే నాయకులు అంతా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారు సైతం టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ దాదాపు క్లోజింగ్ దశకు చేరుకుంది.