అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ భవనాలన్నిటినీ పక్కా భవనాలుగా, శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. దీనికోసం వైసీపీ సర్కారు వెచ్చిస్తున్న మొత్తం అక్షరాలా 3,825.15 కోట్ల రూపాయలు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సచివాలయాల భవనాలకోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం, సచివాలయాన్నిటినీ పక్కా భవనాల్లోకి మార్చేస్తున్న ప్రభుత్వం లేదంటే అతిశయోక్తి కాదు.