వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలోని పేదలకు కట్టించే ఇళ్ల నమూనాని ఈపాటికే సిద్ధం చేసింది ప్రభుత్వం. అయితే ఈ నమూనాకి అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసేందుకు కూడా సిద్దంగా ఉండాలని అధికారులు ఇంజినీరింగ్ విభాగం సిబ్బందికి తెలియజేశారు. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ అధికారులతో ఉన్నత స్థాయి సెమినార్ జరిగింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట నున్న గృహ నిర్మాణాల్లో ఎక్కడా లోపాలు ఉండరాదని, నాణ్యంగా ఉండాలని ఇంజనీరింగ్ సిబ్బందిని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.