తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో జనసేన బరిలో దిగితే పవన్ ఏపీ పాలిటిక్స్ లో హీరో కావడం ఖాయం. తిరుపతిలో గెలిచినా, గెలుపు అంచుల వరకు వచ్చి ఓడినా, కనీసం టీడీపీని వెనక్కి నెట్టినా మానసికంగా అది జనసేనకు పెద్ద బలం అవుతుంది. భవిష్యత్తులో బీజేపీ, జనసేన కూటమిపై జనంలో అంచనాలు పెరుగుతాయి. అందుకే పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ కోసం ఆశపడుతున్నారు.