రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను భారీగా పెరగగబోతోంది. మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్సుకు గవర్నరు ఆమోద ముద్ర వేయడంతో ఈ లాంఛనం పూర్తయింది. వచ్చే ఏప్రిల్ నుంచే కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుందని, దానికి సిద్ధం కావాలని అధికారులు స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లో ఐదేళ్లకు ఒకసారి పన్నులు సవరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో పలు సంవత్సరాలుగా ఆ ప్రక్రియ జరగలేదు. చివరిగా 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు పన్నులు సవరించారు. ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించడం వల్ల పన్ను అనేక రెట్లు పెరగుతుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.