తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్నీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంది...ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే విషయం అంతు చిక్కడం లేదు. గ్రేటర్ బరిలో అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, కమ్యూనిస్టులు ఇతర చిన్నాచితక పార్టీలు పోటీ చేస్తున్నాయి.