గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా జరిగేలా కనిపిస్తున్నాయి. అన్నీ పార్టీలు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అటు కాంగ్రెస్ సైతం దూకుడు కనబరుస్తోంది. ఇటు ఓల్డ్ సిటీలో ఎంఐఎం దూసుకెళుతుంది. ఇక టీడీపీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే గ్రేటర్ బరిలో ఇన్ని పార్టీలు బరిలో ఉన్న ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీకి అన్నట్లుగానే పరిస్తితి కనిపిస్తోంది.