గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ-ఎంఐఎం పార్టీలు తీవ్ర మాటల యుద్ధానికి దిగాయి. బీజేపీ పూర్తిగా హిందుత్వ పార్టీగా ఉంటే, ఎంఐఎం ముస్లిం పార్టీగా ముద్రవేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అసలు ఎన్నికల ప్రచారం మొదలవ్వడమే ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. బీజేపీ గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేశారు.