ఏపీలో 2019 ఎన్నికల తర్వాత మరో ఎన్నిక జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా, అవి కరోనా వల్ల వాయిదా పడ్డాయి. అయితే త్వరలోనే తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నిక జగన్ ప్రభుత్వానికి రిఫరెండంగా మారాయి.