ఈ మధ్య అధికార వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోయిన విషయం తెలిసిందే. సొంత పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కాకినాడ డీఆర్సీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎంపీ పిల్లి ఆరోపించగా.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు అవినీతి చేశారో వారి పేర్లు తనకు ఇవ్వాలని ద్వారంపూడి ఎంపీని కోరారు.