మైలార్‌దేవ్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ దాస్ గౌడ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఏర్పాటు చేసిన మహిళా సదస్సుకు ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పేద ప్రజలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్ల ద్వారా ప్రతి ఇంటికి పెద్దన్న పాత్ర కేసీఆర్ పోషిస్తున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 50 శాతం టికెట్లు మహిళలకు కేటాయించారని గుర్తు చేశారు. మళ్లీ ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు..