పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఆరేళ్ళు అవుతున్న ఇంకా ఓనమాలు నేర్చుకునే స్థాయిలో ఉన్నలు కనిపిస్తుంది. 2014 లో జనసేన పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతిచ్చి ఆ తర్వాత సినిమాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో డైరెక్ట్ గా పాల్గొని ఒక్క సీటు ను దక్కించుకుని ఘోర పరాభవం పాలైన పవన్ ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తారనుకున్నారు జన సైనికులు. అయన సినిమా అభిమానులు కూడా పవన్ సినిమాలు మానేస్తున్నానని చెప్పడంతో అయన ఇక రాజకీయాలకే అంకితం అని అనుకున్నారు..