పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ అస్లాం ఉల్లా షరీఫ్ పురానాపూల్ డివిజన్లో బుధవారం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని అన్ని బస్తీల్లో మహిళా కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.